గర్భం  దాల్చిన బస్సు

గర్భం  దాల్చిన స్త్రీ లా ఉంది  బస్సు
వూపిరి స్పౄహ తప్పి పడిపొతుందేమోనన్న భయం
ఆవిరి శబ్ధాల ప్రభుద్దులు కొందరు చెవులు బద్ధలు కొట్టి మౄత్యు కుహరాల్లొకి నెట్టించేస్తున్నారు 
వాక్ తుంపర ప్రళయంలొ తడిసి మోపెడవుతున్నారు కొందరు
ఆ మౄత్యుంజయుల  హక్కుల ప్రతిధ్వనులు   ఎద లయలలో సిలువలు మోస్తున్నాయి …
నింపాదిగా అనాదిగా ఆ రోడ్డు హౄదయానికి హత్తుకొని పారాడుతుంది బస్సు
బస్సు చక్రాల ముద్దులతో విలిప్తమై గ్రామం మసక బారిన మొద్దులా ఎదురేగింది
దుమ్ము లేపిన బస్సు నమ్మకంగా వూరు చేరింది నమ్మక్ హరాం గాదని ప్రూవ్ చేసింది
దప్పికైన బస్సు గొంతులో నీటి చుక్కలు ఒలక బొసిన దేవుడన్న డ్రైవర్
విష్ణు చక్రం లాంటి స్టీరింగ్ తొ    ‘ధర్మ సంస్థాపనర్థాయాం’ ఉద్భవించినట్లున్నాడు
   టిక్కెట్ల గుండెల ఇక్కట్లను మరచి పరపరమని చింపాడు ఆ విశిష్ట గుణ సంపన్నుడు – కండక్టరు
గర్భం దాల్చిన బస్సు ప్రసవించింది- కులం మతం ధనిక బీద తేడా తెలియని పయనాన్ని! 
 
(నా కవితా సంకలనం ‘ సాగర మథనం (మార్చ్ 2000)నుండి)
ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s


%d bloggers like this: